Quantcast
Channel: MaaStars
Viewing all articles
Browse latest Browse all 2793

`చెలియా` ఆడియో ఆవిష్క‌ర‌ణ‌

$
0
0

దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌ద్రాస్ టాకీస్ తెర‌కెక్కించిన చిత్రం `చెలియా`. కార్తీ, అదితిరావ్ హైద‌రీ జంట‌గా న‌టించారు .మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఎ.ఆర్ రెహ‌మాన్ సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియో వేడుక కార్య‌క్ర‌మ మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ లో ఘ‌నంగా జ‌రిగింది. ఆడియో సీడీల‌ను సీతారామ‌శాస్త్రి విడుద‌ల చేసి తొలి ప్ర‌తిని ఎ.ఆర్‌.రెహ‌మాన్‌కు అంద‌జేశారు. అనంత‌రం

ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం మాట్లాడుతూ “చెలియా ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో చూపిస్తూ అంద‌మైన ల‌వ్ స్టోరీ కూడా అల్లా. ఇందులో కార్తీ డిఫ‌రెంట్ గా క‌నిపిస్తాడు. అంద‌మైన అదితిరావు ఉంది. ఎ.ఆర్‌.రెహ‌మాన్‌గారు, సీతారామ‌శాస్త్రిగారు సినిమాకు పిల్ల‌ర్స్. వాళ్ల వ‌ల్లే ఇంత మంచి మ్యూజిక్ కుదిరింది. పాట‌లు, సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది. దిల్‌రాజుగారు బ్యాన‌ర్‌ ద్వారా సినిమా రిలీజ్ అవ్వ‌డంతో సినిమాపై న‌మ్మ‌కంగా ఉంటున్నాం. అలాగే ఇటీవ‌లే దిల్‌రాజుగారి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయ‌న‌కు, ఆయ‌న కుటుంబానికి మా ప్ర‌గాఢ సానుభూతిని తెలుపుతున్నాం` అని అన్నారు.

సుహాసిని మాట్లాడుతూ “మ‌ణిర‌త్నంగారి సినిమాల‌కు నేనే పెద్ద క్రిటిక్ ని. మీకు రాయ‌డం వ‌చ్చా? అని విమ‌ర్శిస్తుంటాను. కానీ ఆయ‌న సినిమాల‌ను ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఆద‌రిస్తారు. అందుకు చాలా సంతోషంగా ఉంది. మ‌రోసారి మ‌ణిర‌త్నంగారు ల‌వ్‌స్టోరీతో ఆడియ‌న్స్ ముందుకు వ‌స్తున్నారు. ఇప్పుడు కూడా ప్రేమ క‌థ‌నే సినిమాగా చేశారు. ఎందుకో కార‌ణం నాకు కూడా తెలియ‌దు. మ‌ణి గారు క్యారెక్ట‌ర్స్ ను డామినేట్ చేస్తుంటాయి . కానీ ఈ క‌థ లో కార్తీ, అదితిరావు ఆయ‌న్నే డామినేట్ చేసేశారు. మ‌ణిరత్నంగారు పెట్టిన ప‌రీక్ష‌ల‌న్నీ పాస్ అయ్యారు. దిల్‌రాజుగారికి మా సానుభూతిని తెలియ‌జేస్తున్నాం. ఆయ‌న‌కు ఆ దేవుడు శ‌క్తినివ్వాల‌ని కోరుకుంటున్నాం. ఆయ‌న మా సినిమాల‌ను రిలీజ్ చేయ‌డం తో చాలా న‌మ్మ‌కంగా ఉండ‌గ‌ల్గుతున్నాం` అని అన్నారు.

సంగీత ద‌ర్శకుడు ఎ.ఆర్‌.రెహ‌మాన్ మాట్లాడుతూ “మ‌ణిరత్నంగారితో 25 ఏల్ల జ‌ర్నీ నాది. తెలుగు పాట‌లంటే నాకు చాలా ఇష్టం. భాష‌లోని గొప్ప‌త‌న‌మే అందుకు కార‌ణం. ఇక బాహుబ‌లితో ప్ర‌పంచస్థాయికి తెలుగు సినిమా చేరింది` అని అన్నారు.

హీరో కార్తీ మాట్లాడుతూ ` ఏ స్కూల్‌లో అయితే సినిమా గురించి తెలుసుకున్నానో అదే స్కూల్‌లో యాక్టింగ్ గురించి తెలుసుకున్నాను. అందుకే ఈ మూవీ నాకు చాలా స్పెష‌ల్. ఇందులో నాది ఛాలెజింగ్ క్యారెక్ట‌ర్. సాధార‌ణంగా ఇలాంటి పాత్ర‌లు అన్న‌య్యా చేస్తాడు. నాకేంటి ఈ స‌మ‌స్య అనుకున్నా. కానీ క‌థ విని చేయాల‌ని ఆస‌క్తి క‌లిగింది. ఫైట‌ర్ ఫైలైట్ క్యారెక్ట‌ర్ అనగానే అర్ధం కాలేదు. త‌ర్వాత కు సంబంధించి ట్రైనింగ్ తీసుకునే ట‌ప్పుడు ఆ పాత్ర ఇంపార్టెన్స్ ఏంటో అర్ధ‌మైంది. ఈ మూవీ నాకు డిఫ‌రెంట్ ఎక్స్ పీరియ‌న్స్ ను ఇచ్చింది. రెండు బ‌ల‌మైన పాత్ర‌లు చుట్టు తిరిగే క‌థ ఇది. నాలాగే ఆడియెన్స్‌కు కూడా గుర్తుండిపోయే సినిమా అవుతుంది. రెహ‌మాన్‌గారి మ్యూజిక్ విన్న‌ప్పుడ‌ల్లా ఓ ఎన‌ర్జీ క్రియేట్ అవుతుంది. ఆ మ్యూజిక్‌లో నేను యాక్ట్ చేయ‌డం హ్య‌పీగా ఉంది. మ‌ణిర‌త్నం గారి స్ట‌యిల్లో ఉండే ఇన్‌టెన్స్ ల‌వ్‌స్టోరీ. ఏప్రిల్ 7న విడుద‌ల చేస్తున్నాం“ అని అన్నారు.

హీరోయిన్ అదితి మాట్లాడుతూ “ హైద‌రాబాద్ నా స్వ‌స్థలం. ఇక్క‌డ‌కు రావ‌డం చాలా హ్యాపీగా ఉంది. నా తొలి తెలుగు సినిమా మ‌ణిర‌త్నంగారు, ఎ.ఆర్‌.రెహ‌మాన్‌గారితో వ‌ర్క్ చేయ‌డం ఆనందంగా ఉంది. నా కిది డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటిది. కార్తీ నా ఫేవ‌రెట్ కో స్టార్‌` అని అన్నారు.

The post `చెలియా` ఆడియో ఆవిష్క‌ర‌ణ‌ appeared first on MaaStars.


Viewing all articles
Browse latest Browse all 2793

Trending Articles