నందమూరి హీరో కల్యాణ్ రామ్ తారక్ సినిమా నిర్మాణం పనుల్లో బిజీగా ఉన్నాడు. అటు తన బాడీ లాంగ్వేజ్ కు తగ్గ స్టోరీలకు కమిట్ అవుతున్నాడు. కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ న్యూ ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నాడు. తాజాగా ఉపేంద్ర అనే కొత్త కుర్రాడికి అవకాశం ఇచ్చినట్లు సమాచారం. గతంలో స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన ఉపేంద్ర కల్యాణ్ రామ్ కు ఇటీవలే ఓ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీ వినిపించాడట.
కథ నచ్చడంత ఆయన వెంటనే ఒకే చేసినట్లు సమాచారం. ఇందులో కల్యాణ్ రామ్ ఎమ్మెల్యే పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. నందమూరి వారసుల్లో ఇప్పటివరకూ వెండి తెరపై అలాంటి పాత్రలు ఏ హీరో పోషించలేదు. ఈ నేపథ్యంలో కల్యాణ్ కి ఈసినిమా మంచి ప్లస్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
The post ఎమ్మెల్యేగా కల్యాణ్ రామ్! appeared first on MaaStars.