
Nenno
నటీనటులు: సాయిరాం శంకర్, శరత్ కుమార్, రేష్మీ మీనన్, కాశీ విశ్వనాథ్, వైవా హర్ష తదితరులు
కెమెరా: సిద్ధార్థ్ రామస్వామి
సంగీతం: మహిత్ నారాయణ్
నిర్మాత: శ్రీకాంత్ రెడ్డి
దర్శకుడు: సుదర్శన్ సలేంద్ర
దర్శకుడు పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ ఇటీవలి కాలంలో కెరీర్ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 143, నేనింతే, డేంజర్, బంపర్ ఆఫర్ వంటి చిత్రాల్లో నటించాడు సాయిరామ్. పూరి స్టైల్లోనే ఎనర్జిటిక్ హీరోగా పేరొచ్చినా బ్లాక్‌బస్టర్లేవీ తగలకపోవడం సాయిరామ్‌కి మైనస్ అయ్యింది. నటుడిగా మంచి మార్కులు పడినా, హీరోగా మాత్రం రెయిజ్ కాలేకపోయాడు. కాస్త గ్యాప్ తర్వాత లేటుగా వచ్చినా లేటెస్టుగా వచ్చాను అన్నట్టే `నేనో రకం` అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అన్నయ్య పూరి సహా పలువురు క్రేజీ యాక్టర్స్ ఈ సినిమాకి ప్రచారం చేయడంతో `నేనోరకం` చిత్రంపైనా అంచనాలు పెరిగాయి. సాయిరామ్‌ని ఈ సినిమా అయినా గట్టెక్కించిందా .. లేదా? అంటే .. ఎస్ .. అతడికి బూస్ట్ ఇచ్చిందనే చెబుతున్నారు క్రిటిక్స్.
కథ:
రికవరీ ఏజెంట్ గౌతమ్ (సాయిరామ్) జీవితంలోకి అనుకోని రీతిలో ప్రవేశిస్తుంది స్వేచ్ఛ (రేష్మి). గౌతమ్ స్వేచ్ఛతో తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు. మొక్కలంటే ఇష్టపడే తన ప్రేయసిని దక్కించుకోవడానికి బోలెడన్ని అబద్ధాలు చెబుతాడు. ఆ క్రమంలోనే స్వేచ్ఛ నారాయణరావు (ఎంఎస్ నారాయణ) ఇంటికి వెళుతుంది. అక్కడ నారాయణరావు తనయుడు వైవా హర్ష అనూహ్యంగా స్వేచ్ఛ ప్రేమలో పడి.. ప్రేమిస్తున్నా అంటూ తన వెంట పడతాడు. అయితే ఆ క్రమంలోనే ఈ ప్రేమికుల మధ్య అనుకోని అగాధం ఏర్పడుతుంది. గౌతమ్‌ని అబద్ధాలు చిక్కుల్లో పడేస్తాయి. అబద్ధాల వల్ల గౌతమ్ జీవితంలో ప్రవేశించిన ఓ ఆజ్ఞాత వ్యక్తి వల్ల ఎలాంటి అగాధం ఏర్పడింది? చివరికి సమస్య నుంచి గౌతమ్ బయటపడ్డాడా? లేదా? ప‌్రేయసిని దక్కించుకున్నాడా? లేదా ? అన్నది బ్యాలెన్స్ స్టోరి.
విశ్లేషణ:
కథ, కథాగమనంలో పక్కా క్లారిటీ వచ్చిన సినిమా ఇది. చాలా గ్యాప్ తర్వాత సాయిరామ్‌కి కలిసొచ్చే సినిమా అనే చెప్పాలి. సాయిరాం శంకర్ ఎనర్జీ, సీనియర్ నటుడు శరత్‌కుమార్ క్యారెక్టరైజేషన్ సినిమాకి పెద్ద అస్సెట్స్. 143 సినిమా తర్వాత సాయిరామ్ మళ్లీ అంతే ఎనర్జిటిక్‌గా నటించిన చిత్రమిది. నటనలో ఎంతో పరిపక్వత కనిపించింది. సాయిరామ్ హీరోయిజాన్ని మించి కథ హీరోగా నిలిచిన సినిమా ఇదని చెప్పాలి. ముఖ్యంగా శరత్‌కుమార్ నటన ద్వితీయార్థానికి జీవం పోసిందనే చెప్పాలి
బలాలు:
సాయిరామ్ నటన
కథ, కథనం, దర్శకత్వం
దర్శకత్వ ప్రతిభ
శరత్‌కుమార్ నటన
నిర్మాణ విలువలు
మైనస్
అక్కడక్కడా స్లో నేరేషన్
ఎంఎస్-వైవా హర్ష కామెడీ బోరింగ్
పాటలు అడ్డంకి
సాంకేతిక విషయాలు:
ఈ సినిమాకి దర్శకత్వం, కెమెరా, ఎడిటింగ్, నేపథ్య సంగీతం అన్నీ పెద్ద ప్లస్ అనే చెప్పాలి. హోళీ సీన్‌లో, హీరో ఫైటింగ్ సీన్లలో సినిమాటోగ్రఫీ అద్భుతం. బ్యాగ్రౌండ్ స్కోర్ సూపర్భ్.
ముగింపు: `నేనోరకం` పక్కా వినోదాత్మక చిత్రం. సాయిరామ్‌కి బూస్ట్ దొరికింది..
మాస్టార్స్.కామ్ రేటింగ్ 3 / 5
The post `నేనోరకం` సినిమా సమీక్ష appeared first on MaaStars.