నందమూరి బాలకృష్ణ 101వ సినిమా నేడు హైదరాబాద్ కూకట్ పల్లి లో భవ్య అపార్ట్ మెంట్స్ తులసి వనం లో ఘనంగా ప్రారంభమైంది. డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో భవ్య క్రియషన్ బ్యానర్ ప్రతీష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. స్ర్కిప్ట్ ను క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ పూరికి అందించారు. అనంతరం హీరో బాలకృష్ణపై దర్శక ధీరుడు ఎస్. ఎస్ రాజమౌళి క్లాప్ నివ్వగా, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా హీరో బాలకృష్ణ మాట్లాడుతూ ` 101 సినిమా కు చాలా క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ కు ఏ మాత్రం తగ్గకుండా సినిమా ఉంటుంది. పూరి జగన్నాధ్-భవ్య క్రియేషన్స్ టీంతో సినిమా చేయడం ఆనందంగా ఉంది. సినిమా ప్రారంభోత్సవాన్ని ఆధ్యాత్మిక ప్రదేశం లో సినిమా ఓపెనింగ్ చేయడం సంతోషంగా ఉంది. మంచి టీమ్ కుదిరింది. కెమెరా మెన్ గా ముకేశ్ ను ఎంపిక చేశాం. మిగతా పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తాం` అని అన్నారు.
చిత్ర దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ `ఈ నెల 16 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. బాలకృష్ణ గారి అభిమానులంతా కొరుకునే విధంగా సినిమా ఉంటుంది. ఆయన స్టైల్ కు ఏ మాత్రం తగ్గకుండా సినిమా తెరకెక్కిస్తాం. కానీ ఇందులో కొత్త బాలయ్యను చూస్తారు. అన్ని పనులు పూర్తిచేసి అనుకున్న తేదికే సినిమా రిలీజ్ చేస్తాం` అని అన్నారు.
ఈ కార్యక్రమంలో బి.గోపాల్, కోదండరామి రెడ్డి, అలీ, సాయి మాధవ్ బుర్రా, నందమూరి శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు
The post భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో బాలయ్య 101వ సినిమా ప్రారంభం appeared first on MaaStars.