ఇటీవలే `శతమానం భవతి` సినిమాతో యంగ్ హీరో శర్వానంద్ మరో సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం వేరే కమిట్ మెంట్లతో బిజీగా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఓ ప్రెస్టీజీయిస్ దర్శకుడితో పనిచేయబోతున్నాడు. అతనెవరో కాదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. శర్వాతో ఓ సినిమా నిర్మించేందుకు త్రివిక్రమ్ సన్నాహాలు చేస్తున్నాడు.
ఇప్పటికే త్రివిక్రమ్ నితిన్‌తో కలిసి ఓ సినిమా నిర్మించేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈ చిత్రానికి చైతన్య కృష్ణ దర్శకుడిగా ఫైనల్ అయ్యాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాతో పాటే శర్వానంద్ హీరోగా తన అసోసియేట్ దర్శకత్వంలో త్రివిక్రమ్ ఈ సినిమాని నిర్మిస్తారుట. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది.
The post శర్వానంద్ నిర్మాత త్రివిక్రమ్ appeared first on MaaStars.