సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కలవడం.. ఆస్కార్ అవార్డుతో సమానమని దర్శకుడు విఘ్నేశ్ శివన్ అభిప్రాయపడ్డారు. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న ‘2.0’ చిత్ర షూటింగ్ ప్రస్తుతం చెన్నై శివార్లలోని ఈవీపీ మాల్ వద్ద ఏర్పాటు చేసిన సెట్‌లో జరుగుతోంది. ఇదే ప్రాంతంలో సూర్య హీరోగా విఘ్నేశ్ తెరకెక్కిస్తున్న చిత్ర షూటింగ్ కూడా జరుగుతోంది.
అయితే రజనీ అభిమానైన విఘ్నేశ్ పక్కన సెట్‌లో ఉన్న ఆయన్ను కలవడానికి వెళ్లారు. ఈ సందర్భంగా రజనీతో కలిసి దిగిన ఫొటో ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ.. ఇది ఆస్కార్ అవార్డు విలువతో సమానం అని పేర్కొన్నారు. జీవితంలో ఈ అవకాశం ఒక్కసారి వస్తుందని హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశాడు.
The post రజనీని కలవడం ఆస్కార్ సమానం appeared first on MaaStars.