`యముడికి మొగుడు` చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది రిచా పనయ్. తొలి సినిమాతో నే రిచా సక్సెస్ హీరోయిన్ గా ప్రూవ్ చేసుకుంది. అనంతరం అవకాశాలు అమ్మడి వెంట క్యూ కట్టాయి. `మనసు మాయ సేయకే`, `చందమామ కథలు`, `లవకుశ` సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ముఖ్యంగా `చందమామ కథలు` సినిమాకు జాతీయ అవార్డు రావడంతో రిచా కు మరింత గుర్తింపు లభించింది. అటుపై సునీల్ సరసన నటించే ఛాన్స్ పుణికి పుచ్చుకుంది.`ఈడు గోల్డె ఎహె` సినిమాలో రిచా తనదైన శైలి పెర్పామెన్స్ తో ప్రేక్షకులను మెప్పించింది. అటు మలయాళంలో పలు సినిమాల్లో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుతం `రక్షక భట్టుడు` సినిమాలో నటిస్తోంది. నేడు( 24 ఫిబ్రవరి) ఆమె పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ విశేషాలను ముచ్చటించారు. ఆ విశేషాలు ఏంటో ఆమె మాటల్లోనే….
**ఫిల్మ్ కెరీర్ సోసోగా సాగిపోతుంది. అయినా హ్యాపీగా నే ఉన్నా. చేసే పనిని ఆస్వాదిస్తున్నా. మంచి అవకాశాలు కోసం వెయిట్ చేస్తున్నా. ఎంపిక చేసుకునే క్యారెక్టర్స్ ఛాలెంజింగ్ గా ఉండాలి. అప్పుడే యాక్టింగ్ లో కిక్ ఉంటుంది.
**ఇప్పుడు అన్ని సినీ పరిశ్రమలో పోటీ గట్టిగా ఉంది. చాలా మంది కొత్త వాళ్లు వస్తున్నారు. సినిమా ఫ్యాషన్ ను ఛాలెంజింగ్ గా తీసుకుని అడుగులు వేస్తున్నారు. వాళ్లతో పోటీ కష్టమే. కానీ ఆరోగ్యకరమైన వాతావరణంలో పోటీ ఉందని భావిస్తున్నా. పోటీని కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నా.
**ఈసారి మహా శివరాత్రి రోజున బర్త్ డే డేట్ కూడా రావడం ఆనందంగా ఉంది. సాధారణంగా ప్రతీ బర్త్ డేకి టెంపుల్ కి వెళ్తా. కానీ ఈసారి టెంపుల్ కు వెళ్లడంతో పాటు, ఆ రోజంతా ఉపవాసం కూడా ఉంటున్నా. సాయంత్రం అయ్యాక ఫాస్టింగ్ ను బ్రేక్ చేస్తా. అసలైన పుట్టిన రోజు వేడుకలు మరుసటి రోజున ప్లాన్ చేశా. స్నేహితులకు పార్టీ ఇస్తున్నా. అదీ ఇంట్లోనే ప్లానే చేశా (నవ్వుతూ).
** `రక్షక భటుడు` తర్వాత ఏ సినిమాకు సైన్ చేయలేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. మాలయాళం సినిమా `క్రాస్ రోడ్` లో నటిస్తున్నా. షూటింగ్ పూర్తయింది. ఏప్రిల్ లో ఆ సినిమా రిలీజ్ అవుతుంది.
** అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీలు చేయాలనుంది. అదే నా డ్రీమ్. కెరీర్ ఆరంభంలో టాలీవుడ్ లో అలాంటి అవకాశాలు కోసమే ఎదురు చూశా. కానీ కుదరలేదు. మంచి పాత్రల్లో టఫ్ క్యారెక్టరైజేషన్స్ లోనే కనిపించా గానీ, వాటిని మాత్రం మిస్ అవుతున్నా. ఆ కల త్వరలోనే నెరవేరుతుందని అనుకుంటున్నా.
** ఏ ఇండస్ర్టీలోనైనా వర్కింగ్ స్టైల్ ఒకలాగే ఉంటుంది. అందులో పెద్ద తేడాలేమి ఉండవు. కానీ నాకు తెలుగు కొంచెం కంపర్ట్ బుల్ గా ఉంటుంది. తెలుగు డైలాగ్ లు కూడా హిందీ, ఇంగ్లీష్ చెప్పినట్లుగానే ఫీల్ అవుతా.
** భావన కు అలా జరిగిందని తెలిసి చాలా బాధపడ్డా. ఆ పెయిన్ ను నా మాటల్లో చెప్పలేను. మలయాళం లో కొన్ని సినిమా వేడుకల్లో భావనను కలిసాను. స్వీట్ గాళ్ల్.
** తెలుగు సినిమాలు చూస్తుంటాను. అల్లు అర్జున్, మహేష్ బాబు నా అభిమాన హీరోలు.
** కొన్ని సందర్భాల్లో చాలా భావోద్వేగానికి గరవుతా. అదే నా వీక్ నెస్. కానీ అలాంటి సందర్భం నాకు నచ్చదు. కానీ అవ్వాల్సి వస్తుంది. అదే నాకు అతి పెద్ద వీక్ నెస్.
** నన్ను నేను బాగా నమ్ముతా. అదే నా బలం. చాలా పాజిటివ్ గా ఉంటా. అదే నమ్ముతా. ఒక పని మొదలు పెట్టినప్పుడు ఆ పని అసంతృప్తిగా ఉంటే ఎన్ని సార్లైనా చేయడానికి రెడీగా ఉంటా. విసుగు…అలసత్వం అనేది ఉండదు. అదే నాకు అతిపెద్ద బలం.
** ఎయిర్ హోస్టస్ నుంచి సినిమాల వైపు సడెన్ గా షిప్ట్ కాలేదు. చదువుకుంటూనే ఎయిర్ హోస్టస్ ఉద్యోగం చేసేదాన్ని. తర్వాత దక్షిణాది సినిమాల్లో అవకాశాలు రావడంతో టర్నింగ్ తీసుకున్నా. నేను ఎన్.సీ.సీ క్యాడెట్ ను కూడా. లక్నో లో ఎన్.సీసీ ట్రైనింగ్ పూర్తిచేశా. సహార ఇండియా, ఎన్.సీ.సీ ల స్కాలర్ షిప్ కూడా తీసుకున్నానని ముగించారు.
The post అల్లు అర్జున్, మహేష్ బాబు నా అభిమాన హీరోలు: హీరోయిన్ రిచా పనయ్ appeared first on MaaStars.