నందమూరి నటసింహ బాలకృష్ణ 101వ సినిమా కోసం ఇప్పటికే వెయిటింగ్ లో చాలా మంది స్టార్ డైరెక్టర్లున్నారు. బాలయ్య ఇప్పటివరకూ దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో వెయింటింగ్ లిస్ట్ మరింత పెరుగుతుంది. తాజాగా బాలయ్య తో `డిక్టేటర్` చిత్రాన్ని తెరకెక్కించిన శ్రీవాస్ కూడా మంచి కథతో సిద్దంగా ఉన్నాడు. గతంలో విడుదలైన డిక్టేటర్ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వనప్పటికీ బాలయ్య మెచ్చి చేసిన కథ ఇది.
దీంతో శ్రీవాస్ కూడా నయా డైరెక్టర్లకు గట్టి పోటీ ఇస్తున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య ఎలాంటి కంటెట్ ఎంచుకుంటే బాగుటుందన్న దానిపై ఆలోచనలో పడ్డాడు. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. చూద్దాం మరి బాలయ్య ఎవరికి ఛాన్స్ ఇస్తాడో.
The post బాలయ్య కోసం ఆ డైరెక్టర్ వెయిటింగ్ లో appeared first on MaaStars.