స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇప్పుడు ఫుల్ ఖుషీ. `శతమానం భవతి`, `నేను లోకల్` బ్లాక్ బస్టర్ అవ్వడంతో రెట్టించిన ఉత్సాహాంలో ఉన్నాడు. ఆ మధ్య రాజా స్పీడ్ స్లో అయినా రీసెంట్ గా వచ్చిన రెండు సక్సెస్ లతో మళ్లీ పుంజుకున్నాడు. కొత్త సినిమాలంటూ మళ్లీ స్పీడు పెంచుతున్నాడు. దీనిలో భాగంగా యంగ హీరో రాజ్ తరుణ్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు.
ఈ చిత్రానికి అనీస్ కృష్ణ దర్శకత్వం వహించనున్నాడట. ప్రస్తుతం ఈ యువ హీరో రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటి తర్వాత దిల్ రాజు సినిమా సెట్స్ కు వెళ్లనుందని సమాచారం. ఈ నేపథ్యంలో పెద్ద బ్యానర్ లో అవకాశం రావడం తో ఖుషీ గా ఉన్నట్లు తెలుస్తోంది.
The post దిల్ రాజు బ్యానర్ లో యంగ్ హీరో! appeared first on MaaStars.