డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రముఖ కన్నడ నిర్మాత మనోహర్ కుమారుడు ఇషాన్‌ను హీరోగా పరిచయం చేస్తూ ‘రోగ్’ అనే సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. `ఇడియట్`, `పోకిరి`, `దేశముదురు`, `లోఫర్` రేంజ్ లో పూరి చిత్రాన్ని చెక్కుతున్నాడు. ఒక్క హిట్ తోనే ఇషాన్ ను స్టార్ హీరో రేంజ్ కు తీసుకెళ్లే విధంగా పూరి స్టైల్లో రప్ఫాడించేస్తున్నాడు. రోగ్ అనే టైటిల్ తోనే పూరి సగం సక్సెస్ అయ్యాడు.
ఇప్పుడు స్టిల్స్ రూపంలో ఒక్కొక్కటిగా మార్కెట్ లోకి వదులుతున్నాడు. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. తల్లకిందుగా హీరోను వేలాడ దీసిన పిక్ సోషల్ వెబ్ సైటల్లో జోరుగా వైరల్ అవుతుంది. ఇది మరో చంటిగాడి ప్రేమ కథ అనే ట్యాగ్ లైన్ తో ఇడియట్ ను కొట్టేలా ఉంటుందని హైప్ క్రియేట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. తెలుగు, కన్నడలో తెరకెక్కుతోన్న సినిమా త్వరలో విడుదల కానుంది.
The post `ఇడియట్` ను కోట్టేలా దించేశాడు appeared first on MaaStars.