సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన ‘కబాలి’ సినిమా ప్రస్తుతం సౌతిండియాలో హాట్ టాపిక్. ఈనెల 22న ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజవుతోంది. ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలన్నీ తారాస్థాయిలో ఉన్నాయి. మూవీ టీమ్ చేపట్టిన ప్రమోషన్స్ కూడా అందుకు తగ్గట్టుగానే సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లాయి. ఇక ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే డిష్కసన్ సాగుతోంది. ఫస్ట్ వీకెండ్ టికెట్స్ దొరకడమనేది గగనంగా ఉందన్న రిపోర్ట్ తమిళనాట ఉంది. నిన్నటినుంచి బుకింగ్స్ మొదలుకావడంతో అభిమానులంతా టికెట్స్ బుకింగ్ హడావుడిలో మునిగిపోయారు. ఇప్పటికే కొన్ని చోట్ల టికెట్స్ అమ్మకం మొదలుపెట్టగా, ఆన్‌లైన్లో గంటలో అన్ని టికెట్స్ అమ్ముడుపోయాయని చెబుతున్నారు. తమిళంలో రియలిస్టిక్ సినిమాల దర్శకుడిగా మంచి పేరున్న పా రంజిత్ తెరకెక్కించిన ఈ సినిమాను కళైపులి థాను పెద్ద ఎత్తున నిర్మించారు. రజనీ నడివయసు గ్యాంగ్‌స్టర్‌గా ఇందులో కనిపించనున్నారు.
తెలుగు నాట రిలీజ్ విషయంలో క్లారిటీనిచ్చారు నిర్మాతలు. నైజాంలో 333 థియేటర్లలో ఈ సినిమా రిలీజవుతోందని అభిషేక్ పిక్చర్స్ అధినేతలు తెలిపారు. ఈ సినిమాని రూ.30 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశాం. 10 కోట్ల మేర బిజినెస్ పూర్తయింది. మిగతా బిజినెస్ ఈ ఒకటి రెండు రోజుల్లోనే పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఆర్.కె.పి ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నైజాంలో ఈ సినిమాని రిలీజ్ చేస్తోంది.
The post `కబాలి`కి నైజాంలో 333 థియేటర్లు! appeared first on MaaStars.