వీరభద్రం చౌదరి దర్శకత్వంలో ఆది హీరోగా నటించిన చుట్టాలబ్బాయి 16 జూలైన ఆడియో రిలీజ్ జరుపుకుంది. వెంకట్ తలారి, రామ్ తాళ్ళూరి సంయుక్తంగా నిర్మించిన ఈ చుట్టాలబ్బాయికి తమన్ సంగీతం అందించారు. మొత్తం ఐదు పాటలున్న ఈ సినిమాలో ప్రతి పాట సందర్భానుసారంగా ఉంటూ, దేనికదే ప్రత్యేకం అనిపించేలా ఉండి సినిమా రిలీజ్ కి ముందే మంచి క్రేజ్ తో దూసుకుపోతున్నాయి.
మూడు రోజుల క్రితం రిలీజైన చుట్టాలబ్బాయి ఆడియోకి యూత్ లో మంచి స్పందన వస్తుంది. ‘రబ్బా.. రబ్బా’, పాటతో పాటు ‘హే బడీ బడీ’ అంటూ సాగే పాటకి యూత్ క్రేజీగా రియాక్ట్ అవుతున్నారు. దానికి తోడు రమ్య బెహరా, సింహా కలిసి పాడిన ‘చుట్టాలబ్బాయి టైటిల్ సాంగ్’ సోషల్ నెట్ వర్క్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంటుంది. ‘లోకం చదివిన చిన్నోడే, లౌక్యం తెలిసినన కుర్రాడే’ పాట ఆది అభిమానుల్లో సినిమా పట్ల అంచనాలను భారీగా పెంచేసింది.
రబ్బా రబ్బా : రబ్బా రబ్బా… హాయిగుంది.. సాగిపోతుంటే రబ్బా... అంటూ సాగే ఈ పాట అంతే హాయిగా సంగీతాభిమానులను ఆకర్షించేసింది. వశిష్ట శర్మ రాసిన ఈ పాట రిలీజయింది మొదలు ఏదో చోట వినిపిస్తూనే ఉంది. తమన్ అందించిన ట్యూన్ ఒక ఎత్తైతే, ఏ మాత్రం గజిబిజీ సాహిత్యం లేకుండా, అతి సాధారణ పదాలతో, ఉల్లాసంగా సాగే ఈ పాటని దీపక్, మేఘ కలిసి పాడారు.
హే బడీ బడీ : తమన్ పాడిన ఈ పాట వింటుంటే అడుగు కదపని వారుండరేమో… హే బడీ బడీ కం.. కం.. కం… అంటూ జోష్ ఫుల్ గా సాగే ఈ పాట ఏ కార్నర్ నుండి వినిపించినా కనెక్ట్ అయిపోవడం కంపల్సరీ… తమన్ అంటేనే జోష్ ఫుల్ సాంగ్స్ కి కేరాఫ్ అడ్రస్.. అలాంటిది తన పాటకి తానే గొంతు కలిపితే ఏం జరుగుతుంది..? అదే జరిగింది. ఈ మధ్య రిలీజైన పాటల్లో అత్యంత క్రేజ్ ఫుల్ గా యూత్ ని ఆకట్టుకున్న సాంగ్స్ జాబితాలో ఈ పాట కూడా చేరిపోయింది. ఈ పాటలో తమన్ తో పాటు సాయి సంతోష్, నివాస్ కూడా గొంతు కలిపారు. వరికుప్పల యాదగిరి ఈ పాటని రాశారు.
పీ పీ డుం డుం : పీ పీ పీ డుం డుం డోలు సన్నాయి… సినిమాలో పెళ్లి సందర్భంగా ఉండే పాట. ఈ మధ్య కాలం సినిమాల్లో ఇలాంటి పాటలే లేవు. అచ్చ తెలుగుతనంతో, పెళ్లి హడావిడినంతా ఒకచోట చేర్చి ట్యూన్స్ కట్టాడా తమన్ అనిపించేలా ఉండే ఈ పాట ఇకపై ప్రతి తెలుగింట పెళ్ళి తంతులో వినిపించడం ఖాయం. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం… పాట విన్న ప్రతి ఒక్కరికి ఇది మా ఇంట పెళ్లి హడావిడే అని తలపిస్తుంది. శ్రీ కృష్ణ, గీతా మాధురి కలిసి పాడిన ఈ పాటకి రామ జోగయ్య శాస్త్రి గొంతు కలపడం విశేషం.
ఆడియో రిలీజ్ అయింది మొదలు మంచి పాజిటివ్ టాక్ దక్కించుకుంటున్న చుట్టాలబ్బాయి బిజినెస్ కూడా ఇప్పటికే మొదలైపోయింది. క్లాస్, మాస్ అంటూ తేడా లేకుండా ఆకట్టుకుంటున్న చుట్టాలబ్బాయి ట్రేలర్ లో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించిన నిర్మాతల నిర్మాణ విలువలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
The post చుట్టాలబ్బాయి ఆడియో సూపర్ హిట్ appeared first on MaaStars.