మనసుంటే మార్గం లేకపోలేదని! మనోళ్లను చూస్తే మొత్తేయాలని, అమ్మను చూస్తే దణ్ణం పెట్టాలని అనిపించేది అందుకే. చెన్నయ్‌లో, తమిళనాడులో రూ.5కే భోజనం దొరుకుతుంది. కానీ ఏపీలో, తెలంగాణలో అలా దొరికే ఛాన్సే లేదు. మనోళ్లు కాస్ట్‌లీ. ఇటీవలే కేసీఆర్, బాబు కూడా తమిళనాడు అమ్మ (జయలలిత) మాదిరిగానే కాస్త ఆలోచించి కొన్నిచోట్ల పేదలకోసం రూ.5కే భోజనం క్యాంటీన్లను ప్రారంభించారు. అయితే ఇప్పుడు అమ్మ ఏర్పాటు చేసిన తక్కువ ధరకు టిక్కెట్లపై సినిమాలు చూసే ఫెసిలిటీస్‌ని ఏపీ, తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. మునుపటిలానే రూ.10, రూ.20, రూ.30 ధరల్లోనే ఐనాక్స్ రేంజు సినిమా చూసే అవకాశం కావాలని జనం కోరుకుంటున్నారు. మరి మన ప్రభుత్వాలు కల్పించగలవా? అదే తమిళనాడులో అమ్మ ఇప్పటికే తక్కువ ధర టికెట్ తరహా పలు థియేటర్లను నిర్మించే ప్లాన్‌లో ఉన్నారు. అమ్మ సినిమా థియేటర్లు పేరుతో వీటిని నిర్మించేందుకు రంగం సిద్ధమైంది.
త్యాగరాయనగర్, షెనాయ్ నగర్ ప్రాంతాల్లో అమ్మథియేటర్ల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. త్యాగరాయనగర్లోని సర్ పి.టి. త్యాగరాయ అరంగం (హాలు)ను, షెనాయర్నగర్లోని కార్పొరేషన్ ఆడిటోరియంను అమ్మ థియేటర్లుగా మార్చాలని కార్పొరేషన్ అధికారులు నిర్ణయించారు. రూ.17.28 కోట్ల వ్యయంతో నిర్మించిన షెనాయ్నగర్ ఆడిటోరియంలో ప్రస్తుతం 3 వేల సీటింగ్ కెపాసిటీ గల ఆడిటోరియం. ఏసీ సదుపాయం ఉంది. ఈ రెండిటిని అమ్మ సినిమా థియేటర్లుగా మారుస్తున్నారు. ఇక్కడ టికెట్ల ధరలు రూ.10లు, రూ.20లు, రూ.30 లుగా ఉంటాయని చెబుతున్నారు. కార్పొరేషన్ కు చెందిన ఖాళీ స్థలాల్లోనూ అమ్మ థియే టర్లను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముగప్పేర్ఈస్ట్ , పాడి పరిసరాల్లోని తమిళనాడు హౌసింగ్ బోర్డుకు చెందిన 3.94 ఎకరాల ఖాళీ స్థలాల్లో, సేతుపట్టు వద్ద గల తారు మిశ్రమం తయారీ కేంద్రం పరిసరాల్లో ‘అమ్మ’ థియేటర్లు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదీ మ్యాటర్.
The post అమ్మ థియేటర్లలో టిక్కెట్ ధరలు రూ.10, రూ.20, రూ.30 appeared first on MaaStars.