మూడు రోజుల క్రితం తన కార్యాలయం మెట్లపై జారిపడిన కమల్‌హాసన్ కోలుకుంటున్నారు. తనపై ప్రేమాభిమానాల్ని చూపిస్తున్న అభిమానులకి ఓ లేఖ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. కోట్లాదిమంది అభిమానుల ఆశీస్సులతోనే ఈ స్థాయిలో ఉన్నానని ఆయన అన్నారు. ”కళాకారుడి జీవితంలో ప్రమాదాలు సహజం. అవి నాకెన్నో పాఠాలు నేర్పించాయి. అయినా ఈ ప్రమాదం జరిగి ఉండకూడదు. మా అభిమాన నటుడికి, అన్నకి, తమ్ముడికి, తండ్రికి ఏమైంది అంటూ కుటుంబ సభ్యుల్లా ప్రేక్షకులు చూపించే ఆధరాభిమానాలకు ధన్యుడిని. నా కుటుంబ సభ్యులు, వైద్యులు నన్ను బాగా చూసుకుంటున్నారు. మీరేమీ కంగారు పడకండి. త్వరలోనే మీ ముందుకు నడుచుకుంటూ వచ్చి కృతజ్ఞతలు చెబుతా” అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.
The post అభిమానులు కలత చెందకండి..! appeared first on MaaStars.