Quantcast
Channel: MaaStars
Viewing all articles
Browse latest Browse all 2793

“దండుపాళ్యం”దర్శకుడి తాజా బ్లాక్ బస్టర్ “బ్రాహ్మణ”ట్రైలర్ విడుదల !!

$
0
0

Arrow
Arrow
ArrowArrow
Slider

“దండు పాళ్యం” చిత్రం అటు కన్నడలోనూ.. ఇటు తెలుగులోనూ సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. “దండుపాళ్యం” అనంతరం శ్రీనివాస్ రాజు దర్సకత్వంలో.. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర హీరోగా రూపొందిన “శివం” చిత్రం సైతం అంతే సంచలనం సృష్టించింది. ఆ చిత్రం ఇప్పుడు తెలుగులో “బ్రాహ్మణ” పేరుతో విడుదలకు సిద్ధమవుతోంది. సి.ఆర్.మనోహర్ సమర్పణలో.. విజి చెరిష్ విజన్స్ మరియు శ్రీ తారకరామ పిక్చర్స్ బ్యానర్స్ పై.. విజయ్.ఎమ్- గుర్రం మహేష్ చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి గుంటూరి కేశవులు నాయుడు సహ నిర్మాత. ఉపేంద్ర సరసన సలోని (మర్యాద రామన్న ఫేం), రాగిణి ద్వివేది హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రానికి సంగీత సంచలనం మణిశర్మ స్వర సారధ్యం వహించడం విశేషం. అనువాద కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం ధియేటర్ ట్రైలర్ ను ప్రముఖ కథానాయకులు శ్రీకాంత్-తరుణ్ రిలీజ్ చేయగా.. మరో ట్రైలర్ ను ఏ.ఎం.ఆర్ కన్ స్ట్రక్షన్స్ అధినేత- “షిర్డీ సాయిబాబా” నిర్మాత అయిన గిరీష్ రెడ్డి, క్రిబీ కన్ స్ట్రక్షన్స్ సౌత్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సదానంద్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాతలు విజయ్.ఎం, గుర్రం మహేష్ చౌదరి, సహ నిర్మాత గుంటూరి కేశవులు నాయుడు, చిత్ర దర్శకులు శ్రీనివాస్ రాజు, ఈ చిత్రాన్ని ఆంధ్రా, తెలంగాణలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రముఖ రచయిత తోట ప్రసాద్ లతోపాటు పలువురు చిత్ర ప్రముఖులు పాల్గొన్నారు.
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. “దండుపాళ్యం” చిత్రంతో శ్రీనివాస్ రాజు ఎంతటి సంచలనం సృష్టించాడో తెలిసిందే. ఆ చిత్రానికి ఎంతమాత్రం తీసిపోని చిత్రం “బ్రాహ్మణ”. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నా మిత్రులు విజయ్, మహేష్, కేశవ్ లకు మంచి విజయం లభించాలని మనసారా కోరుకుంటున్నాను” అన్నారు. హీరో తరుణ్ మాట్లాడుతూ.. “ఉపేంద్ర గారి సినిమాలన్నీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఈ సినిమాను నేను కన్నడలో చూసాను. తెలుగులో కూడా ఖఛ్చితంగా ఘన విజయం సాధిస్తుంది” అన్నారు.
రామ సత్యనారాయణ మాటాడుతూ.. “బ్రాహ్మణ” వంటి గొప్ప చిత్రాన్ని ఏపీ, తెలంగాణాల్లో డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం ఇఛ్చిన నిర్మాతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు” అన్నారు.
చిత్ర దర్శకుడు శ్రీనివాస్ రాజు మాట్లాడుతూ.. “దండుపాళ్యం” చిత్రం నచ్చిన ప్రతి ఒక్కరికీ “బ్రాహ్మణ” కూడా తప్పకుండా నచ్చుతుంది. ఎన్ని అంచనాలు పెట్టుకొని వఛ్చినా సరే ఆడియన్స్ డిజప్పాయింట్ అవ్వరు” అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ.. “ఉపేంద్ర నటన, శ్రీనివాస్ రాజు దర్శకత్వ ప్రతిభ, మణిశర్మ సంగీతం “బ్రాహ్మణ” చిత్రానికి ప్రధానాకర్షణలు. ఈ నెలలోనే ఆడియోను రిలీజ్ చేసి.. సినిమాను అతి త్వరలో విడుదల ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.
ఇతర వక్తలంతా.. “బ్రాహ్మణ” ట్రైలర్ చాలా బాగుందని ప్రశంసించడంతో పాటు.. ఈ చిత్రం కన్నడలో కంటే తెలుగులో మరింత పెద్ద విజయం సాధించాలని ఆకాక్షించారు.
రవిశంకర్, మకరంద్ దేశ్ పాండే తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించిన “బ్రాహ్మణ” చిత్రానికి సినిమాటోగ్రఫి: వెంకట ప్రసాద్, ఎడిటర్: వినోద్ మనోహర్, సంగీతం: మణిశర్మ, సహనిర్మాత: గుంటూరి కేశవులు నాయుడు, సమర్పణ: సి.ఆర్.మనోహర్, నిర్మాతలు: విజయ్.ఎం- గుర్రం మహేష్ చౌదరి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీనివాస్ రాజు !!

The post “దండుపాళ్యం” దర్శకుడి తాజా బ్లాక్ బస్టర్ “బ్రాహ్మణ” ట్రైలర్ విడుదల !! appeared first on MaaStars.


Viewing all articles
Browse latest Browse all 2793

Trending Articles