బాలీవుడ్ లో ఎలాగోలా పట్టు సాధించాలన్న ఉద్దేశంతో టాలీవుడ్ కి దూరమైన ఇలియానా.. రీసెంట్ గా బంజారాహిల్స్ లో ఏర్పాటు చేసిన స్కెచర్స్ షో రూం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయింది… ఈ సందర్భంగా మాట్లాడుతూ… “ఏదైనా కొత్తగా చేయాలనే ఉద్దేశంతోనే బాలీవుడ్ పై కాన్సంట్రేట్ చేస్తున్నాను.” అని చెప్పింది.
ఇలియానాకి తెలుగులో కూడా అవకాశాలు వస్తున్నా పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలే వస్తుండటంతో ఒప్పుకోవడం లేదు అని తెలుస్తుంది. మంచి పాత్ర దొరికితే తెలుగు సినిమాకోసం ఎప్పుడైనా సిద్దమే అంటున్న ఇలియానా….
‘గే’ ల ప్రస్తావన వచ్చినప్పుడు నా ఫ్రెండ్ సర్కిల్ లో కూడా ‘గే’ లు ఉన్నారు.. కొంతమంది వారిని చులకనగా చూస్తారు కానీ.. నిజానికి వారికి కూడా ఒక వ్యక్తిత్వం ఉంటుంది. నేను వాళ్ళతో క్లోజ్ గా ఉంటాను కాబట్టి నాకు వాళ్ళ గురించి బాగా తెలుసు అంది ఇలియానా…
ప్రస్తుతానికి ఇలియానా చేతిలో అక్షయ్ కుమార్ సరసన చేస్తున్న ‘రుస్తుం’ తప్ప ఇంకో సినిమా లేదనే చెప్పాలి. అందుకే ఈ సినిమాపై ఆశలైతే భారీగానే పెట్టుకుంది. మరి ఈ ‘రుస్తుం’ అయినా ఇలియానా కరియర్ ని గట్టెక్కిస్తుందో లేదో చూడాలి.
The post ‘గే’ లంటే చాలా ఇష్టమంటున్న ఇలియానా appeared first on MaaStars.