యంగ్ హీరో సందీప్ కిషన్‌కి సెట్‌లో ప్రమాదం జరిగింది. ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తున్న టైమ్‌లో అతడు అదుపు తప్పి కింద పడిపోవడంతో తలకు గాయమైంది. తలకు ఐదు కుట్లు పడ్డాయి.. అయితే అతడికి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే…. సందీప్ కిషన్ హీరోగా కృష్ణ వంశీ దర్శకత్వంలో `నక్షత్రం` అనే సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసం ఓ భారీ యాక్షన్ సీన్ తెరకెక్కిస్తున్నారు. సందీప్ యాక్షన్ మోడ్‌లో ఉండగా ఫైటర్ పొరపాటు వల్ల అతడు స్లిప్ అయ్యి కింద పడిపోయాడు. వెంటనే చిత్రయూనిట్ అతడిని ఆస్పత్రికి తరలించింది. డాక్టర్లు చికిత్స చేసి, తలకు తగిలిన గాయానికి కుట్లు వేసి, రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని చెప్పారు. అంతకుమించి ప్రమాదమేం లేదని చెప్పారు.
The post సందీప్‌కి యాక్సిడెంట్.. నో డేంజర్! appeared first on MaaStars.