లేడీ సెంట్రిక్ కథల్లో నటించనంటూనే బొమ్మాళి అనుష్క సైలైంట్ గా అలాంటి కథలకు ఒకే చెప్పేస్తోంది. అరుంధతి, రుద్రమదేవి చిత్రాలతో నాయికగా తారా స్థాయికి చేరుకున్న భామ ఇప్పుడు భాగమతిగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు జి. అశోక్ చెప్పిన కథకు ముందు ఆలోచించినా తర్వాత ఎస్ అని అందరికీ ఝలక్ ఇచ్చింది. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కనున్న సినిమా త్వరలో సెట్స్ కు వెళ్లనుంది. అయితే ఇందులో ఓ మేల్ రోల్ కూడా కీలక పాత్ర కానుంది. అదీ అనుష్క సరసన కావడంతో ఏ హీరోను ఎంపిక చేయాలో తెలియక దర్శకుడు అశోక్ ఫైనల్ గా ఆది పినిశె ట్టిని ఫిక్స్ చేసినట్లు సమాచారం.
ఇటీవలే దర్శకుడు ఆదిని కలిసి కథ వినిపించడాట. కథ నచ్చడంతో ఆది వెంటనే ఒకే చేసేశాడని సమాచారం. అయితే ఈ విషయాలన్నీ అధికారికంగా వెల్లడికావాల్సియుంది. ఇటీవలే ఆది సరైనోడు చిత్రంలో విలన్ గా నటించి విమర్శకుల ప్రశంలందుకున్నాడు. ఇప్పుడీ అవకాశం ఆది కెరీర్ కు మరింత దొహదపడుతుందని తెలుస్తోంది. తెలుగలో హీరోగా రాణించలేకపోయినా ప్రతి నాయకుడు, ముఖ్యమైన పాత్ర లకు ఎంపికవుతూ టాలీవుడ్ కు బాగానే టచ్ లో ఉంటున్నాడీ హీరో కమ్ విలన్.
The post అనుష్క తో బన్ని విలన్ రొమాన్స్ ! appeared first on MaaStars.