మదరాసిపట్టణం, ఐ .. సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితం ఎమీజాక్సన్. రామ్‌చరణ్ సరసన `ఎవడు` చిత్రంలో ఒకానొక కథానాయికగా నటించింది. తమిళ్‌లో క్రేజీ హీరోల సరసన అవకాశాలు అందుకుంటూనే ఉంది ఈ భామ. అయితే ఓ వైపు తమిళ్‌లో నటిస్తూనే తెలుగులోనూ నటించాలన్న తన కలను పదే పదే చెబుతూనే ఉంది. ప్రభాస్ సరసన నటించాలన్నది తన డ్రీమ్ అని చెప్పింది ఇదివరకే. ఇప్పుడు ఆ డ్రీమ్ నెరవేరబోతోంది. ఎమీజాక్సన్‌కి ఓ రెండు తెలుగు సినిమాల్లో నటించే ఛాన్సొచ్చింది. వాటిలో ఒకటి ప్రభాస్ – సుజిత్ కాంబినేషన్ సినిమా, వేరొకటి అల్లు అర్జున్ – లింగుస్వామి ప్రాజెక్ట్ కన్ఫమ్ అయినట్టే. ప్రభాస్ సరసన డ్రీమ్ నెరవేరనుంది. ఎలానూ ఇప్పటికే దేశంలోనే అత్యంత క్రేజీయెస్ట్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న 2.0 (రోబో2)లో ఓ కీలకపాత్రలో నటిస్తోంది. ఏ విధంగా చూసినా ఈ ఇంగ్లీష్ కలువ మన సౌత్ ఇండస్ర్టీస్‌ని ఏలేస్తోంది.
The post ప్రభాస్, బన్నిల సరసన ఎమీజాక్సన్ appeared first on MaaStars.