ప్రభుదేవా, తమన్నా, సోనుసూద్ ప్రధాన పాత్రల్లో `నాన్న` ఫేం ఏ.ఎల్.విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న త్రిభాషా చిత్రం `అభినేత్రి`. కోన ఫిలిం కార్పోరేషన్- బ్లూ సర్కిల్ కార్పోరేషన్- బిఎల్ఎన్ సినిమా- ఎంవివి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కోన వెంకట్, ఎం.వి.వి.సత్యనారాయణ, శివ తుర్లపాటి, అరుణ్ నిర్మాతలు. హిందీలో సోనూసూద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని సోనూసూద్ ఆవిష్కరించారు. ఫస్ట్‌లుక్‌ని వి.వి.వినాయక్ ఆవిష్కరించారు. కెఎఫ్‌సి (కోన ఫిలిం కార్పొరేషన్) బ్యానర్‌ని అగ్రనిర్మాత డి.సురేష్‌బాబు, బి.ఎల్.సి (బ్లూ సర్కిల్ కార్పొరేషన్) బ్యానర్‌ని స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు.
అనంతరం చిత్ర నిర్మాతల్లో ఒకరైన కోన వెంకట్ మాట్లాడుతూ -“నేను చేసిన సినిమాల్లో మంచి సినిమాల వల్ల చాలామందికి మేలు జరుగుతోంది. ప్రతిభావంతులకు ఉపాధి లభిస్తోంది. మంచి సినిమాకి కావాల్సింది మంచి కథ. ఈ సినిమాకి జర్నీ ప్రభుగారితో మొదలైంది. తొలుత ఆయనకు కథ చెప్పా. నేను ఓ కథ చెబుతా విను అంటూ ఆయన ఓ కథ చెప్పారు. టీజర్ లెంగ్త్ కథ అది. ఆ కథ నచ్చి నేనే నిర్మిస్తానని ముందుకొచ్చాను. నాకంటే డైరెక్టర్ విజయ్ కథ బాగా చెబుతాడు వినండి అన్నారు. విజయ్ కథ చెప్పగానే నేనే ఈ సినిమా నిర్మించాలనుకున్నా. అలా సినిమా మొదలైంది. తమన్నా, సోనూసూద్, ప్రభుదేవా, విజయ్ నలుగురూ నాలుగు పిల్లర్ల వంటివారు. విజయ్ డిజైన్‌లో మేం ఇంటీరియర్స్. ఇండియాలో ఎన్నో మంచి సినిమాలొచ్చాయి. కానీ మూడు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన చిత్రమిదే. పాటలు, కొందరు నటీనటులతో ఫ్రెష్‌గా ప్రతి బాషలోనూ తెరకెక్కించాం. మొదటిసారి ఏకకాలంలో 3 భాషల్లో తీసిన చిత్రమిదే. తమన్నా వైవిధ్యమైన పాత్రలో నటించింది. ప్రభుదేవాతో గతంలో పరిచయం ఉండేది. ఈ సినిమాతో అది స్నేహం అయ్యింది. అతడు ప్రతిదాంట్లో కామెడీ వెతుకుతారు. అలా నటించే ప్రయత్నం చేస్తారు. సోనూసూద్‌తో దూకుడు నుంచి పరిచయం ఉంది. తను డ్యూయెల్ రోల్ చేశాడా? లేదా? అన్నది తెరపైనే చూడాలి. ఈ సినిమాకి అందరి ఆదరణ కావాలి“ అన్నారు.
వి.వి.వినాయక్ మాట్లాడుతూ- “టీజర్ అద్బుతంగా ఉంది. అభినేత్రి టైటిల్ తమన్నాకు బాగా సరిపోతుంది. ఇంతకముందు తనతో రెండు సినిమాలు చేసిన అనుభవంతో చెప్తున్నాను. కోన వెంకట్ ఒకరోజు ఈ సినిమా కథ చెప్పడానికి ఫోన్ చేశాడు. మంచి కథ. నాకు బాగా నచ్చింది. తెలుగు ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది. ప్రభుదేవా ఎంతో ఇష్టమైన వ్యక్తి. తను హైదరాబాద్ లో ఓ డాన్స్ స్కూల్ పెట్టాలని కోరుకుంటున్నాను. అభినేత్రి పెద్ద విజయం సాధిస్తుంది“ అన్నారు.
రచయిత విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ- “తమన్నా బాహుబలి చిత్రంలో చక్కని పాత్రలో నటించింది. మరో విలక్షణమైన రోల్ చేస్తోంది. వేరొకరి కథను ఓ రైటర్ సినిమా తీయడం గొప్పే. పెద్ద సక్సెస్ అవ్వాలి“ అన్నారు.
డి.సురేష్ బాబు మాట్లాడుతూ- “మంచి కథ ఉన్న చిత్రమిది. తమన్నా ఇన్వాల్వ్‌మెంట్ ఉన్న నటి. సినిమాలో లీనమై నటించింది. పెద్ద విజయం అందుకోవాలి“ అన్నారు.
ప్రభుదేవా మాట్లాడుతూ- “నేను బొంబాయి డైరెక్టర్‌ని, హైదరాబాద్ లో డ్యాన్స్‌మాస్టర్‌ని. అభినేత్రి కథ నచ్చి తమిళంలో నేనే నిర్మించా. డైరెక్టర్ విజయ్గాకి సహనం చాలా ఎక్కువ. నాకు అసలు అది ఉండదు. ఈ సినిమా కోసం చాలా సహనంగా ఉంటూ.. ఆయన చెప్పినట్లు నటించా. సినిమా బాగా వచ్చింది“ అన్నారు.
తమన్నా మాట్లాడుతూ-“కోన వెంకట్ నా కెరీర్ లో చాలా ముఖ్యమైన వ్యక్తి. నా మొదటి సినిమా `శ్రీ`కి రచయిత ఆయన. అప్పట్నుంచి నా కెరీర్‌లో అడుగడుగునా ఆయన ఉన్నారు. ఇలా అభినేత్రి వరకు రావడానికి ఆయన కూడా ఓ కారణం. బాహుబలి తరువాత ప్రేక్షకులు నా నుండి కొత్తదనాన్ని కోరుకుంటారు. అందుకే నేను కొత్తదనం నిండిన ఈ స్క్రిప్ట్ ఎంచుకున్నా. విజయ్ కథ చెప్పినప్పుడు బాగా నచ్చి వెంటనే ఓకే చెప్పేశా. విజయ్ వల్ల నటిగా మరింత బెటర్ అయ్యాను. ఇందులో చేస్తే ప్రభుదేవాతో నేరుగా కలవొచ్చనే అంగీకరించా. ఆయన కింగ్ ఆఫ్ డాన్స్ కాదు గాడ్ ఆఫ్ డాన్స్ అనాలి. ఇది హారర్ కాదు, ఏ జోనర్ కు చెందిన సినిమానో తెరపై చూసి మీరే డిసైడ్ చేయండి“ అన్నారు.
దర్శకుడు విజయ్ మాట్లాడుతూ- “ఈ సినిమా నాకు చాలా స్పెషల్. పాల్ లారెన్ నేను కలిసి కథ రాసుకున్నాం. ఈ సినిమా మొదలు పెట్టిన తరువాత మధ్యలో ఆపేసే పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో నాకు సహకరించిన గణేష్ గారికి నా థాంక్స్. ఈ సినిమాలో ప్రభుదేవా గారి పెర్ఫార్మన్స్ అద్బుతంగా ఉంటుంది. తమన్నా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ వినగానే ఒప్పేసుకుంది. స్టోరీ తనకు అంత బాగా నచ్చింది” అని చెప్పారు
కోన వెంకట్ మాట్లాడుతూ.. ”నేను ప్రభుదేవా గారికి స్టోరీ చెప్పడానికి బొంబాయి వెళ్లాను. ఆయన కథ విని మెచ్చుకొని నా దగ్గర స్టోరీ ఉంది వింటారా అనడిగారు. ఆ కథ విని వెంటనే సినిమా చేయాలనుకున్నాను. అంతగా నచ్చింది. ఈ సినిమాకు తమన్నా, ప్రభుదేవా, సోనుసూద్, విజయ్ నాలుగు స్థంబాలు. మూడు భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని షూట్ చేస్తున్నాం. ఏ బాషకు తగ్గట్లుగా ఆ భాషకు క్యారెక్టర్ ఆర్టిస్టులను సెలక్ట్ చేసుకొని చేశాం. ఈ సినిమాకు పెద్ద అసెట్ స్టోరీ” అని చెప్పారు.
ఎం.వి.వి సత్యనారాయణ మాట్లాడుతూ-“కోనతో కలిసి శంకరాభరణం తరువాత మంచి సినిమా చేయాలనుకున్నా. ఈ కథ బాగా నచ్చి సెట్స్‌కెళ్లాం. అందరికీ నచ్చే సినిమా తీశాం. మీ ఆదరణ కావాలి“ అన్నారు. సప్తగిరి చక్కని నటుడని అతిధులంతా ప్రశంసించారు.
సోనుసూద్ మాట్లాడుతూ“ఇదో స్పెషల్ మూవీ. ప్రత్యేకత ఉన్న కథతో విజయ్ ప్రత్యేకంగా తెరకెక్కించారు. తొలిసారి మూడు భాషల్లో తెరకెక్కిన సినిమాలో నటించా. పెద్ద స్పాన్ ఉన్న సినిమా ఇదని అంతా నమ్మాం. హిందీలో నేనే నిర్మించాను. జాకీచాన్ సినిమాతో బిజీగా ఉన్నా. మళ్లీ తెలుగులో నటించే ఆలోచన ఉంది“ అన్నారు.
The post `అభినేత్రి` ఫస్ట్‌లుక్ & టీజర్ లాంచ్ appeared first on MaaStars.