డికాప్రియో హెయిర్‌స్టైల్లో ఓ తెలుగు హీరోని ఊహించుకోండి! ప్చ్.. ఎవరూ స్ఫురించడం లేదు కదూ? అప్పట్లో తమిళ హీరో కునాల్ ఆ టైపులో కనిపించేవాడు. మధ్యలోకి రెండు పాయలు విడిచి అతడు దువ్విన హెయిర్ స్టైల్ ఓ ట్రెండ్ సెట్టర్ అయ్యింది. `ప్రేమికుల రోజు` రిలీజ్ తర్వాత కునాల్ హెయిర్ స్టయిల్ అని యూత్‌లో వైరల్ అయ్యింది ఆ స్టయిల్. అయితే ఇటీవలి కాలంలో మళ్లీ ఆ తరహాలో న్యూ హెయిర్ స్టయిల్ ఏదీ తెలుగులో కనిపించలేదు. కనిపించట్లేదు అనుకుంటుండగానే ఒకడొచ్చాడు!!
టాలీవుడ్ స్పీడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన హీరోల హెయిర్ స్టయిల్ మార్చేస్తూ ప్రయోగాలు చేస్తుంటాడు. తను ఎంచుకున్న హీరోని అంతకుమునుపు ఎప్పుడూ కనిపించనంత కొత్తగా చూపించడం అతడికే చెల్లింది. మహేష్, చరణ్, బన్ని, ప్రభాస్, నితిన్, ఎన్టీఆర్ లాంటి హీరోల్ని సంథింగ్ స్పెషల్‌గా చూపించిన ట్రాక్‌రికార్డ్ పూరీకే ఉంది. హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్ నుంచి ప్రతిదీ తనవద్దకు వెళ్లగానే మారిపోవాల్సిందే. `టెంపర్` మూవీతో అసలు ఈయన ఎన్టీఆరేనా? అనే సందేహం వచ్చే రేంజుకి తారక్‌ని మార్చేశాడు. కొత్త హెయిర్‌స్టయిల్, బాడీ లాంగ్వేజ్ ని చూపించాడు.
తారక్ తర్వాత లేటెస్టుగా పూరీకి మరో హీరో తగిలాడు. అతడే నందమూరి కళ్యాణ్‌రామ్. కమిట్‌మెంట్ ఉన్న అతికొద్దిమంది హీరోల్లో ఒకడిగా కళ్యాణ్‌రామ్ ఇప్పటికే ప్రూవ్డ్. సినిమా అంటే ప్యాషన్ ఉన్న హీరో కం నిర్మాత. అందుకే ఈసారి పూరీ కళ్యాణ్ రామ్‌పై గురిపెట్టాడు. అతడు తన కెరీర్‌లోనే కనిపించనంత కొత్తగా లుక్‌ని డిజైన్ చేశాడు. ఇదిగో ఈ ఫోటో చూస్తుంటే ఏమనిపిస్తోంది? టైటానిక్ హీరో డికాప్రియోలా అనిపించడం లేదూ? ఎడమవైపు నుంచి ఒక పాయ తలకట్టు కుడివైపు వాలిపోయింది. దానికి కాంబినేషన్‌గా ఆ కళ్లద్దాలు, ట్రిమ్ చేసిన గడ్డం, గుబురైన మీసకట్టు.. క్యా సీన్ హై అనిపించేలా లేవూ? నాట్ ఓన్లీ దట్ .. ఆ గెటప్ ఛేంజ్‌కి తగ్గట్టే కాంబినేషన్ కాస్ట్యూమ్స్‌ని ఎలివేట్ చేశారు. ఈ లుక్ డిజైన్ సింప్లీ సూపర్భ్. ఓ కొత్త కళ్యాణ్‌రామ్ కనిపిస్తున్నారు. అంతకుమించి చెప్పాలంటే అచ్చం టైటానిక్ హీరో డికాప్రియోలా అనిపిస్తున్నాడు! ఆల్ ది బెస్ట్ టు కళ్యాణ్‌రామ్.
The post టైటానిక్ హీరోనే `తల`దన్నేలా…! appeared first on MaaStars.