ఇది డ్రామాలకే డ్రామా! హైడ్రామా! పెద్దల పోరులో పరాకాష్ఠ డ్రామా! ఏపీ సీఎం చంద్రబాబు రాజకీయాల్లో ఉద్దండుడు అన్న సంగతి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆయన లెవలేంటో మరోసారి జనాలకు అర్థమయ్యే సీన్ కనిపిస్తోంది. పెద్దల సభకు పోరులో ఉత్కంఠ రేపే మెలో డ్రామా ప్లాన్ చేశారు బాబు. ప్రతిపక్ష జగన్‌ని ఉక్కరిబిక్కిరి చేసే నయా గేమ్ ప్లాన్ ఇది. ఏపీ నుంచి పెద్దల సభకు నలుగురు తేదేపా తరపున, ఒకరు వైసీపీ తరపున వెళ్లే ఛాన్సుంది. అయితే తేదేపా ఇప్పటికే ముగ్గురిని ఫైనల్ చేసేసింది. సుజనాచౌదరి, టీజీ వెంకటేష్, సురేష్ ప్రభు(బీజేపీ) పేర్లు ఖరారు చేశారని, అధినేత చంద్రబాబు అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఇక నాలుగో అభ్యర్థిని పోటీకి దింపేందుకు వ్యూహరచన చేశారు.
అందులో భాగంగానే తేదేపా అధినేత ప్రతిపక్ష వైసీపీ నుంచి బరిలో దిగుతున్న విజయసాయిరెడ్డిపై వార్‌కి తెరలేపారు. వైసీపీ నుంచి తేదేపాలోకి పార్టీ ఫిరాయించిన జలీల్‌ఖాన్‌ని రంగంలోకి దించి ఎటాక్ ప్రారంభించారు. విజయసాయిరెడ్డికి వైసీపీ ఎమ్మెల్యేలే ఓటు వేయరు. అతడిపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉంది అంటూ సైకలాజికల్‌గా దెబ్బకొట్టే మైండ్‌గేమ్ మొదలు పెట్టారు. విజయసాయికి అనుభవం అంతగా లేదు. పెద్దల సభకు సరిపోరు అంటూ జలీల్ మీడియా ఎదుట విమర్శించారు. ఇదంతా చూస్తుంటే ఎట్టి పరిస్థితిలో వైసీపీ నుంచి పెద్దల సభకు వెళ్లనీకుండా ఆపాలన్న బాబు కుయుక్తి బైటికి అర్థమవుతోంది. రాజకీయాల్లో ఇవన్నీ మామూలే. ఎత్తు – పై ఎత్తు ఉంటాయ్. ఇదివరకు బాబు ఆ నాలుగో సీటు కోసం మరీ అంత ఆరాటపడడం లేదని ప్రచారం సాగినా అదంతా ఉత్తుత్తే డ్రామాలో భాగమేనని తాజా ఉదంతంతో అర్థం చేసుకోవాల్సొస్తోంది. వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేసే ఏ అవకాశాన్ని బాబు వదులుకోరు అనడానికి విజయసాయిపై జలీల్ ఎటాక్ ఉదంతం ఎగ్జాంపుల్. ఇప్పటికే తేదేపాలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలతో బాబు మంతనాలు సాగించారు. ఆ నాలుగో అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారో చూడాలి.
The post రాజ్యసభ పోటీలో హైడ్రామా! బాబు మైండ్‌గేమ్!! appeared first on MaaStars.