గ్రీన్‌సన్ ఇన్నోవేటివ్స్ పతాకంపై జైహిత సమర్పణలో గన్నవరపు చంద్ర శేఖర్, డుంగ్రోత్ పీర్యా నాయక్, గ్యార రవి నిర్మాతలుగా నాగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `ఇక సె.. లవ్`. సాయి రవి- దీప్తి జంటగా నటించారు. సెన్సార్ సహా అన్ని పనులు పూర్తయిన ఈ చిత్రం జూన్ 10న రిలీజవుతోంది. మధు సంగీతం అందించిన ఈ సినిమా పాటలు మార్కెట్లోకి రిలీజయ్యాయి. తొలి సీడీని జి.నాగేశ్వరరెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో పీర్యా నాయక్, రవి, శేఖర్, జర్నలిస్టు మురళి, మధు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ -“కొత్త హీరో, కొత్త దర్శకుడు, కొత్త టెక్నీషియన్లతో సినిమా తీయడం చాలా కష్టం. నిర్మాత ధైర్యం చేసి ఈ ప్రయత్నం చేసినందుకు అభినందిస్తున్నా. దర్శకుడు నాగరాజు ఎంతో కష్టించి పని చేసే రచయిత. ప్రతిభావంతుడు. నా సినిమాకి ఘోస్ట్ రైటర్‌గా పనిచేశాడు. దర్శకత్వం చేయాలనే పట్టుదలతో వచ్చాడు. అతడి కష్టం ఫలించాలి. పెద్ద హిట్ కొట్టాలి. మేకింగ్ లో విషయం ట్రైలర్‌లో కనిపిస్తోంది. ప్రతి ఫ్రేములో క్రియేటివిటీ కనిపిస్తోంది. టైటిల్, పోస్టర్ నుంచి ప్రతిదీ ఆకట్టుకునేలా ఉన్నాయి. అందరికీ సపోర్టు కావాలి. సే .. సక్సెస్“ అన్నారు.
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ -“అంతా కొత్త వారితో సినిమా చేయాలని దర్శకుడితో అన్నాను. నా మాట ప్రకారమే కొత్తవారితో సినిమా చేశారు. దర్శకుడిగా నాగరాజు, సంగీత దర్శకుడిగా మధు పరిచయం అవుతున్నారు. కొత్త కొత్త లొకేషన్లను ఈ సినిమాలో చూపించాన. అనుభవం లేని టె్క్నీషియన్లతో సమస్యలొస్తాయి. అయినా ఎంతో శ్రమించి తెరకెక్కించగలిగాం. అయితే రిలీజ్ సమస్యల్ని అధిగమించి ఇప్పటికి రాగలిగాం“ అన్నారు.
చిత్ర దర్శకుడు నాగరాజు మాట్లాడుతూ -“చాలా కాలం పరిశ్రమలో రచయితగా పనిచేశాను. రవిరాజా పినిశెట్టి, ఇవివి వంటి వారి వద్ద పని చేశాను. తొలిసారి దర్శకుడిగా ప్రయత్నిస్తున్నా. అందరి ఆశీస్సులు కావాలి. బెస్ట్ టెక్నికల్ వాల్యూస్‌తో తీసిన చిత్రమిది. పాటలు అందరికీ నచ్చుతాయి.“ అన్నారు.
జర్నలిస్టు మురళి, డిఎంకె, కిరణ్, ప్రియా శర్మ, ఆర్.వి.ఎస్.సాగర్, హారిక తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: వి.శ్రీనివాసరెడ్డి, ఎడిటింగ్: నాగిరెడ్డి, సంగీతం: మధు, కథ-మాటలు-కథనం-దర్శకత్వం: నాగరాజు.
The post `ఇక సె..లవ్` ఆడియో ఆవిష్కరణ appeared first on MaaStars.