నేనా.. సింగిలా.. ఎవరు చెప్పారు! కట్ కట్ ఇప్పుడా ప్రస్థావన వద్దే వద్దు! అంటూ కట్ చేసేసింది సమంత. నేను సింగిల్ కాదు, లవ్‌లో ఉన్నా, ఉన్నంత మాత్రాన పేరు చెప్పాలా? అన్నట్టే మీడియాని ఆటపట్టించింది శామ్. దాని పర్యవసానం ఆ తర్వాత నేరుగా ఫేస్ చేయాల్సొచ్చింది. సమంత సీక్రెట్ లవర్ ఎవరబ్బా! అంటూ మీడియా నానా యాగీ చేసింది. ఆ సఖుడెవరో చెప్పేస్తే పోలా? అంటూ వెంబడించింది. లవరు పేరు పైకి చెప్పకూడని రహస్యమా? పెళ్లి అనేది- జోలికి వెళ్లకూడని వ్యవహారమా? ఎందుకింత బచాయించుడు? అంటూ లొల్లి లొల్లి చేసేశారు. అయినా ఇప్పటికీ ఆ పేరు లీక్ చేయనే లేదు. ఓ యంగ్ హీరో అంటూ మళ్లీ ట్విట్టర్‌లో గిల్లికజ్జాలు స్టార్ట్ చేసింది. ట్వీట్లతో రోజుకో అప్‌డేట్ చెబుతున్న సమంత.. తాజాగా మరో టాప్ సీక్రెట్‌ని రివీల్ చేసింది.
‘నాకు బాగా నచ్చినవి ఇవిగో.. నా ఎన్ లాకెట్, నా చిన్న ఫ్లాట్లు, నా బకెట్ బ్యాగ్, ఓ గ్రేట్ బుక్’ అంటూ తనకి ఇష్టమైన వాటి ఫోటోల్ని ట్వీట్ చేసింది.
ఎన్ లాకెట్ అని క్లూ ఇచ్చింది కాబట్టి `ఎన్` అనే అక్షరంతో ఉన్న ఆ మిస్టర్ ఎవరు? అంటూ మీడియా మరోసారి క్వశ్చన్ రెయిజ్ చేసింది. అసలింతకీ ఎవరీ మిస్టర్ `ఎన్`?
The post శామ్‌ను వెంటాడే మిస్టర్ `ఎన్` ఎవరు? appeared first on MaaStars.