స్పీడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా `జనగనమన` తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కథ రెడీ చేస్తున్నారు. పూరీ ఓ వైపు తాజా ప్రాజెక్టులు పూర్తి చేస్తూనే ప్రిన్స్‌పై కాన్సంట్రేట్ చేస్తున్నాడు. పోకిరి, బిజినెస్‌మేన్ లాంటి సక్సెస్‌ఫుల్ సినిమాల్ని అందించిన పూరి, మహేష్‌కి మరో బ్లాక్‌బస్టర్ అందించాలన్న తపనతో ఉన్నాడు. అందుకే ఇటీవలే `జనగనమన` లాంటి మైండ్‌బ్లోవింగ్ టైటిల్‌ని ప్రకటించాడు. టైటిల్‌కి ఇటు పరిశ్రమ వర్గాల నుంచి, అటు అభిమానుల నుండి, అదిరిపోయే స్పందన వచ్చింది. ఈ టైటిల్‌లోనే సక్సెస్ కనిపిస్తోందన్న ప్రశంసలు వచ్చాయి. ‘జనగనమన’ అన్న టైటిల్‌కి తగ్గట్టే కంటెంట్ లోనూ అంతే పంచ్ ఉంటుందని అనుకుంటున్నారంతా.
The post పూరి- మహేష్ `జనగనమన`కు ఏ ఢోఖా లేదు! appeared first on MaaStars.