అవతార్ సంచలనాల గురించి, రోబో వసూళ్ల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రపంచ విఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరూన్ క్రియేట్ చేసిన పండోరా గ్రహం, అవతార్ రూపాలు సినిమా ప్రియుల్ని కట్టిపడేశాయి. ఇక భారతదేశంతో పాటు పలు దేశాల్లో మన శంకర్ దర్శకత్వం వహించిన `రోబో` పెను సంచలనాలకు తెరతీసింది. హాలీవుడ్ స్టాండర్డ్స్‌కి ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించడంలో శంకర్ పనితనానికి హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ అంతటివాడే హ్యాట్సాఫ్ చెప్పారు. అయితే మళ్లీ ఆ స్థాయి సినిమా దక్షిణ భారతదేశంలో వస్తుందా? అన్న చర్చ సాగుతున్న టైమ్‌లో మన తెలుగువాడైన ఎస్.ఎస్.రాజమౌళి `బాహుబలి` వంటి విజువల్ వండర్‌ని క్రియేట్ చేసి ప్రపంచం మెప్పు పొందాడు. బాహుబలి ఇంటా బైటా కలెక్షన్ల సునామీ సృష్టించింది.
ప్రస్తుతం ఈ మూడు సినిమాలకు సీక్వెల్స్ తెరకెక్కుతున్నాయి. అయితే ఇవన్నీ ఒకేసారి రిలీజైతే పరిస్థితేంటి? .. ప్రేక్షకులకు విజువల్ పండుగ వచ్చినట్టే. అయితే ఆ మేరకు మన సినిమాకు వసూళ్ల పరంగా దెబ్బ పడిపోతే? .. అయితే కామెరూన్ `అవతార్-2`ని 2017 చివరి నాటికి ఎట్టిపరిస్థితిలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. 2.0 (రోబో-2) కూడా అదే టైమ్‌కి రిలీజ్ కానుంది. సేమ్ టైమ్ `బాహుబలి-2` రిలీజవుతుందన్న టాక్ నడుస్తోంది. కాబట్టి ఈ మూడు సినిమాలు ఒకదానితో ఒకటి పోటీపడితే పరిస్థితి ఏంటన్నదే ప్రశ్న. అయితే పోటీలో ఎన్ని ఉన్నా.. `బాహుబలి-2` జోనర్ సపరేట్ కాబట్టి ఆ ముప్పు ఏమీ ఉండదని అనుకోవాలా? వెయిట్ అండ్ సీ..
The post 2.0 (X) అవతార్ -2 (X) బాహుబలి -2 appeared first on MaaStars.